మధురభాష
మధురభాష
తన నవ్వుల పూలవీణ..తంత్రులపై కదులుతాను..!
తన అందెల రవళిసాక్షి..మౌనమునై వెలుగుతాను..!
అవిశ్రాంత కర్మయోగి..నా బంగరు తల్లి కదా..
తన చూపుల ఊయలలో..పసిపాపై ఊగుతాను..!
అక్షరాల మేఘాలకు..మెఱుపులేల పొదిగేనో..
మధురభావ వర్షానికి..వాక్యమునై మిగులుతాను..!
అర్థాలను పండించే..నిఘంటువుల తోడుకదా..
పాలలోని వెన్నచాటు..దీపమునై ఒదుగుతాను..!
కథాకావ్య రచనలన్ని..అద్భుతాలె ప్రియనేస్తం..
కాకిపలుకు మాటుతీపి..రాగమునై సాగుతాను..!
చిగురాకుల ఆవేదన..తీర్చు చినుకు దారమునే..
కవికోకిల పదములలో..వసంతమై నిండుతాను..!
