మధుర భావాలు
మధుర భావాలు
మధుర భావాలను
మనసులో నింపుకుని
జడలో మల్లెలు
తురిముకునే వేళ
మనసేమో మధుమాసపు కోయిలై కూసింది
వయసేమో వయ్యారి వానజల్లులా కురిసి
హరివిల్లులా విరిసింది
అరవిరిసిన కనుల మాటున నిదరోయిన తలపులు
నవమల్లికలై విచ్చుకుని
అందరాని ఊహల
తీరాలకు చేరుస్తుంటే
నా మనసు పరవశించింది
నీ తలపుల తపనలో హాయిగా తడిచిపొమ్మంది

