STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

మబ్బులు మహిమా

మబ్బులు మహిమా

1 min
3


మబ్బులు మహారాణి

మేఘాల అంతరిని

మబ్బు మేఘాల ముచ్చట్లు

మురిపె చినుకు చప్పట్లు.


మబ్బు మసకల అల్లిక

మేఘావృత పొందిక

మబ్బులు మాటున

మెరిసే వర్ష సూచన


అనుసంధించు నింగీ, నేలని

అవరోదించు కాంతి వేగాన్ని

అలజడులు లేపు జగాన్ని

అందించు అహమున చల్లదనాన్ని


వలపుల చంద్రని చాటున దాచి

వెన్నెల రాత్రి వన్నెను తెంచి

వడి వడిగా వినీలాకాశాన విహరించి

విరుజల్లులు కురిపించి, తపంచినా!


తలపోసారు మబ్బుని అపకీర్తితో

తృణీకరించారు తిట్లు పురాణములతో

తీరపుటంచల శాపనార్థాలతో

తత్తర పాటు తీరుతెన్నులతో


మబ్బు లేక జల్లు పలుకునా 

మబ్బే నీటికి ప్రధాత కాదా!

మబ్బు లేని మనుగడ సాధ్యమా

మరి-నీరు లేక నేల నెగ్గునా


మబ్బు మేఘాల మమతలు

మబ్బు నేస్తాలు-గాలి గాంధర్వాలు

మమేకముతో సాగె పయనాలు

మబ్బు చాటున మురిసే జీవనాలు


  


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics