మౌనములో
మౌనములో
మౌనములో చేరుటయే..మేలైనది ఇపుడు..!
నీ చూపుల వెన్నెలయే..విందైనది ఇపుడు..!
కోరికలను పరిమార్చే..ఆయుధమే దొరికె..
మరి ఏమీ ఆశించని..మనసైనది ఇపుడు..!
విశ్రాంతిని ప్రసాదించు..మందిరమది ఏదొ..
అనుభవాల సాక్షియైన..తనువైనది ఇపుడు..!
పాఠాలను బోధించే..వారెవరో ఏమొ..
చెలిమిమీర ఈ శ్వాసయె..గురువైనది ఇపుడు..!
నేర్పరితనమేదైనా..సాధనతో దక్కు..
నేర్చుకునే ఆసక్తియె..బలమైనది ఇపుడు..!
ప్రేమగాక ఈ విశ్వము..నడుపు శక్తి ఏది..
విచక్షణయె దారిచూపు..వెలుగైనది ఇపుడు..!

