STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మౌనమే మనసుకి

మౌనమే మనసుకి

1 min
1

రెప్పలు మూసినా నీవాయే

కన్నులు తెరిచినా నీ రూపాయే

నిద్దురలోనూ నీ కలలాయే

మెలకువలోనూ నీ తలపాయే

ఆగిపోయినా నీ నీడాయే

నడక సాగిపోయినా నీ తోడాయే

నీ ఆలోచనలకు హద్దు లేదాయే

నా ఆలాపనకు అంతం లేకపోయే

మరపే నాకు రాదాయే

మరణం నన్ను చేరదాయే

మౌనమే మనసుకి తెరగా మిగిలిపోయే....



Rate this content
Log in

Similar telugu poem from Romance