మాయరి
మాయరి
నీ చూపుల సరిగమలే వినిపించిన చాలు కదా..!
నీ రాకతొ చిరునవ్వులు ..వరియించిన చాలు కదా..!
నీ అడుగుల జాడలోని పూవులేరుకుంటున్నా..!
కంటకాల గాయాలతొ మురిపించిన చాలు కదా..!
కనిపించిన వాలు జాడే., వయ్యారము ఒలికించెను
నాగినియై కాటేస్తే. మరణించిన చాలు కదా...!
శివుని విల్లు అనిపించెను. , కను బొమ్మల. తీరేమో..!
ఆ విల్లును. ఎక్కుపెట్టి. కరుణించిన. చాలుకదా..!
నా పేరును నీ గళమున ఉచ్చరిస్తె చాలునులే....
లోకములో మౌనమునిగ నన్నుంచిన చాలుకదా...

