మాయ మాటలు
మాయ మాటలు
1 min
615
ఏమయ్యా
రేపటితో ఈ పక్షులన్నీ ఇక్కడికి రావు కదా
ఆడ చెట్టు అడిగింది
మగ చెట్టు అంది
అంతేనే మనిషైనా మానైనా
ఉపయోగం ఉన్నంత వరకే ఇలువ
అయినా మనకు నీళ్ళు పోసి పెంచినోళ్ళు
పోయారు కదా
వాళ్ళ సేవకే మనల్ని కొట్టేస్తున్నారు
మనం కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోతున్నామనుకో
చెట్లు మాట్లాడితే
మనుషులు చెప్పే(మాయ) మాటల్ని మార్చుకోవాలేమో