Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ravisankara Sarma Evani

Inspirational

4.5  

Ravisankara Sarma Evani

Inspirational

మార్పుతో మంచియుగం !

మార్పుతో మంచియుగం !

1 min
344


ఎండకు వానకు అనేక కోట్ల సంవత్సరాలు . 

నేడు మన భూమి మీద మమతానురాగాలు . 

మనిషి ఏర్పరచుకున్న కలల సామ్రాజ్యం ఇది . 

ఖండాలుగా దేశాలుగా విభజన జరిగినది . 

యుగాల పేర్లు , విశేషాలు చాలా చెప్పుకుంటాం . 

మానవాళికి ఆదర్శమని గొప్పగా ఆడిపాడుతాం . 

కానీ అప్పడూ ఉన్నాయి అసామాజిక క్రృత్యాలు . 

అసూయద్వేషాలనేవి సహజ స్వభావాలు . 

అధిగమించినపుడే మనకు మంచి జీవితాలు . 

అదే ఘోషిస్తున్నాయి అన్ని మత గ్రంధాలు . 

సాంకేతిక ఉన్నతి ముందుకు తీసుకెళ్తోంది . 

మనిషి స్వార్ధవిధానం సమస్యలు స్రృష్టిస్తోంది . 

చట్టాలు న్యాయాలు అంతా ఒకటిగా లేవుగా . 

అమలు చేసే పద్ధతులు అన్నీ తారుమారుగా . 

మార్పుకై అంతర్జాతీయ మేధావుల సదస్సులు . 

తమకు అనుగుణంగా కొంతమంది ద్రోహులు . 

ఫలితంగా ప్రపంచమంతా పలు అసమానతలు . 

ఎప్పడేమి జరుగుతుందో అనే ఆందోళనలు . 

అణువణువు శోధించి చెడును నిర్మూలించు . 

మంచి యుగమని భావించు , అలా పయనించు . 



Rate this content
Log in