STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

మార్గమేది

మార్గమేది

1 min
1

ఏది నీకు ఎంతిష్టమొ..తెలుసుకునే మార్గమేది..!?

నువు మెచ్చే బహుమతేదొ..ఇచ్చుకునే మార్గమేది..!?


నోరులేని ఏ పూవును..బలి ఇవ్వను మనప్రేమకు..

నీ పాటకు ఊపిరిలా..అల్లుకునే మార్గమేది..!?


మన శ్వాసల పొదరింటిని..వర్ణించే మాటలేవి..

నీ పెదవుల మౌనమింత..ఒంపుకునే మార్గమేది..!?


గాలికెంత తడబాటో..తనహృదినే మీటుకొఱకు..

తన నవ్వుల మెఱుపులిన్ని..పట్టుకునే మార్గమేది..!?


ప్రేమమధువు లూరించే..ఆ సొగసుల వనమేదో..

తన వసంత మాధురులను..నిలుపుకునే మార్గమేది..!?



Rate this content
Log in

Similar telugu poem from Classics