మానవులు
మానవులు
గగనకుసుమాలుగ మారాయి
దేవతా వస్త్రాలుగా మిగిలాయి
బంధాలను కలుషితం చేసేసారు
అనుబంధాలను అమ్మేసుకుంటున్నారు
ఆప్యాయతలకు ఖరీదు కట్టేసారు
ఆత్మీయతలను ఆశించకండి
భంగపాటు తప్పదు..
ప్రతిపనికి చిన్నవిషయాలకు
నాకేంటి లాభం రేటెంతంటున్నారు
పెళ్ళిళ్ళకు పేరంటానికి ఆఖరికి
చావులకు దినాలకు తద్దినాలకు
కిరాయిబంధాలను తెచ్చుకుంటున్నారు
భోజనాలకు ఫలహారాలకు
రకరకాల వస్తువులు విద్య వైద్య ఆర్థిక
సలహాలకు కిరాయి యాప్లు
నవ్విపోదురుగాక నాకేంటి
పనిగడిచిపోతే చాలంటూ
డబ్బేలోకంగా బతుకుతున్నారు
నేటి ఆధునిక మానవులు..!
