STORYMIRROR

Malleswari Kolla

Classics Inspirational Others

4  

Malleswari Kolla

Classics Inspirational Others

మానవత్వం

మానవత్వం

1 min
400

ఓ మానవుడా........

కులమతాలను కూలద్రోలి

ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు

అసూయను అంతం చేసి

ఆపదలో ఉన్నవారికి సాయం చెయ్యి

ధనదాహాన్ని వదిలిపెట్టి

ఇతరుల కష్టానికి చలించు

ద్వేషాన్ని పాతిపెట్టి

స్నేహ హస్తాన్ని అందించు

అహంకారానికి దూరమయ్యి

సుఖసంతోషాలకు దగ్గరవ్వు

స్వచ్ఛత అనే చిరునవ్వుని ధరించి

హద్దులు ఎరుగని ప్రేమను పంచు

కోటీశ్వరుడువి కావాలనే కలలను విడిచిపెట్టి

నిజాయితీపరుడివై జీవితపు కలలను నెరవేర్చుకో

నీ వెంట రాని ఇంటిని, ఒంటిని రోజూ కడగడం కాదు

ఎల్లప్పుడూ నీతో ఉండే మనసును కడిగి చూడు

మనిషిగా బ్రతకటం ముఖ్యం కాదు

మానవత్వంతో బ్రతకటం ముఖ్యమని తెలుసుకో

సమాజంలో నీ విలువని పెంచుకో.....



Rate this content
Log in

Similar telugu poem from Classics