STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మానసం

మానసం

1 min
7



నీ పూజన రాలిపోగ..పూసినదీ మానసం..! 
తలపులతో పనేలేక..పండినదీ మానసం..! 

చేదుకోగ ఏమున్నది..చరిత్రలో కలలేవో.. 
రేపటితో ముడివిడగా..పొంగినదీ మానసం..! 

ఊహలింటి మావిచివురు..సేవించే కోకిలయె.. 
నీ పాటగ జీవించగ..మురిసినదీ మానసం..! 

అవసరాల వీధులలో..వెతుకులాట తొలగెలే.. 
శ్వాసపక్షి సాక్షిగాను..ఆగినదీ మానసం..! 

వసంతాల ఊయలలో..చిత్రవర్ణ క్రీడలో.. 
నేర్చుకోగ జన్మలెన్నొ..గడిపినదీ మానసం..! 

రుచిరరాగ సంద్రాలయ..సరిగమలకు కావ్యమై.. 
నిలువలేని తనమేదో..వీడినదీ మానసం..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics