STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

మా జెండా

మా జెండా

1 min
2


విశ్వశాంతి గీతమునే..పాడుతోంది మా జండా..! 

విశ్వమైత్రి కనుపాపగ..వెలుగుతోంది మా జండా..! 


యుద్ధకాంక్ష ఛాయకూడ..రూపుమాపు చక్రధ్వజ.. 

మానవతా సందేశం..పంచుతోంది మా జండా..! 


వర్ణాలను కలిపివేయు..స్వచ్ఛధవళ కేంద్రవర్ణ..

హరితధాత్రి కలలపంట..నిలుపుతోంది మా జండా..! 


కాషాయపు యోగశక్తి..త్యాగనిరతి పూర్ణహృదయ..

కరుణారస ప్రపూర్ణతను..చాటుతోంది మా జండా..! 


స్వయంప్రభ భాసమాన..మౌనధ్యాన నిత్యమగ్న..

సమైక్యతా వేదమునే..పలుకుతోంది మా జండా..! 


తలవంచని ధీరత్వం..సొంతమైన శౌర్యరత్న..

బుద్ధత్వపు రుజుమార్గం..చూపుతోంది మా జండా..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics