లోపం ఎక్కడ?
లోపం ఎక్కడ?
నేనో
అందమైన అమ్మాయిని
అంటారందరూ
కనుముక్కుతీరు అద్భుతం
పెదాలు కోరుక్కుతినేలా
మిగిలిన అందాలు
స్త్రీలకే ఈర్ష్య కలిగేలా
నా పొందు స్వర్గసుఖం
నా కనుసైగ
ఓ క్రీగంటి చూపు
ఓ వంకర నవ్వు
కనీ కనిపించని అందాల ప్రదర్శన
ద్వంద్వార్థ మాటలు
ఏవి కూడా
వివాహం చెయ్యలేకపోతున్నాయి
అన్నీ నేనిచ్చేస్తే
కావాలి కదూ మీకు
ఒక్క కుజ దోషం తప్ప....
*********%%%%**********