లేరు లెమ్మ
లేరు లెమ్మ
నీ ప్రపంచ సృష్టికర్త..వేరెచటో లేరులెమ్ము..!
నీ స్వర్గం నీ నరకం..ఇంకెచటో లేవులెమ్ము..!
నీ చుట్టూ ఉన్నవన్ని..నీ ఊహా రూపాలే..
జగమంతా నీ సినిమా..గాకేమీ కాదులెమ్ము..!
కూటస్థపు పసిడిబిందు..రాజమదే నీ మూలం..
నాటకాన్ని నడపగాను..ఇంకెవరో లేడులెమ్ము..!
సత్యమెఱుక పరచేనది..నీ మౌనమె నెమ్మదిగా..
చైతన్యపు సిరియెలేక..పదార్థమది లేదులెమ్ము..!
పద'అర్థము పదముచాటు..చంచలతా భావనమే..
ఆలోచన రుచిచూసే..ముచ్చటయే తోడులెమ్ము..!
పంచభూత రాశి పుట్టె..చిన్నికోర్కె వల్లనేను..
ఈ వసంత వనవాటిక..ఆశాలత గూడులెమ్ము..!
