STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

లాభమేమిటి

లాభమేమిటి

1 min
6


చేనుమేసే కంచెలాగా..బతికిపోతే లాభమేమిటి..!? 
దగాచేసే బుద్ధిమానక..చచ్చిపోతే లాభమేమిటి..!?

మల్లెకన్నా తెల్ల దుస్తులు..ధరించేస్తే మంచిదేలే.. 
మొండిమరకలు మనసునిండా..ఉండిపోతే లాభమేమిటి..!? 

ఎన్నిజన్మలు ఎత్తితేనో..గద్దెనెక్కే ఫలము దక్కెను..
ప్రజాక్షేమం తుంగలోపల..తొక్కిపోతే లాభమేమిటి..!? 

తెలివిఉండీ తేటలేకే..వెర్రిపరుగులు వింతకోర్కెలు.. 
ఆశపడుతూ మిడిసిపడుతూ..రాలిపోతే లాభమేమిటి..!?

గాలిలో నో నీటిపైనో..నడిచివెళ్ళే సిద్ధులేవో.. 
కాలయాపన సిద్ధులేవో..పొందిపోతే లాభమేమిటి..!? 



Rate this content
Log in

Similar telugu poem from Classics