కవులు దెయ్యం
కవులు దెయ్యం
కవి హృదయంలో కదిలే భావాలు
మనసులో మెదిలే ఊహలు
కలం కాగితం వరకే పరిమితం కాకుండ
నిస్వార్థంగా,అణువంత కీర్తికంక్ష లేకుండ
కలం కదిలించే ముందు ఆ భావాలకు
రూపమిచ్చి..ఊహలను నిజం చేస్తు
సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని
ఆచరణకై కవి పాదాలు ముందుకు సాగి...
అప్పుడు కాగితంపై లిఖిస్తే రేపటి పౌరుల
బంగారు భవితకు చక్కటి మార్గదర్శకులై
ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించగలరు
చరిత్ర పుటల్లో కవులకు ఒక పేజీ
సుస్థిరంగ,శాశ్వతంగా ఉంటుంది
ఇది కేవలం కవులకు మాత్రమే సాధ్యం
