STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

కవితాగ్ని

కవితాగ్ని

1 min
153


ఊసుబోక రాస్తున్నాననుకోకు...

చివుక్కున గుచ్చుకుని ఉలిక్కిపడేలా చేసే

కలం మేఘాలు వర్షించే అక్షర చినుకులు ఇవి.


మోడు వారిన చెట్టు

దిగులను పోగొట్టి

మొలిచే పూత బాసలివి.


వరద ముంచిన 

ఇంటి కన్నీరు తుడిచే

హస్త విరులివి.


అథఃపాతాళాన్ని సైతం

అంతరిక్షమంచున చేరవేసే

యంత్ర తంత్రాలు నా రాతలు.


సూటిగా... ఘాటుగా... యుద్ధచౌర్యాన్ని

వేలెత్తి చూపే పదునైన వేళ్ళు.

అవసరమైతే యుద్ధోన్మాదుల

కళ్ళల్లోకి దూసుకెళ్తవి.


ఉద్యమానికి ఊతకర్రలై..

పిడికెళ్ళు బిగించి....

దూకే కాళ్లకు

దారులు చూపుతాయ్.


ఎండిన గుండెల యాతన

కంటకాలను కత్తిరించి...

సంతోషమద్ది..

మందారాలు పూయించే

సూర్యకిరణాలను సృష్టిస్తవి.


వట్టి రాతలే అని హేళన చేయకు

కవితాగ్నిలోంచి ఎగిసిన

ప్రశ్నల సునామీని సృష్టించి ముంచెత్తగలవు.

       


Rate this content
Log in

Similar telugu poem from Classics