STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics

4  

SATYA PAVAN GANDHAM

Classics

"కవిత పై కవిత్వం"

"కవిత పై కవిత్వం"

1 min
406

కవితా... ఓ కవితా...

నా శ్వాసలో పరిమళం నువ్వు..

నా ఆశకి అపరిమితం నువ్వు..

నా భాషకి భావం నువ్వు..

నా ఊహకి రూపం నువ్వు..


కవితా ... ఓ కవితా...

నడిరేయి మెలుకవలో స్వప్నం నువ్వు..

ఉదయపు వేకువలో సుప్రభాతం నువ్వు..

మధ్యాహ్నపు ఆకలిలో ఆహారం నువ్వు..

సంధ్యపు చల్లని సమీరం నువ్వు..


కవితా ... ఓ కవితా...

నా చీకటికి వెన్నల నువ్వు..

నా వెలుగుల దారి నువ్వు..

నా ఒంటరికి తోడు నువ్వు..

నా తోడుకి నీడ నువ్వు..


కవితా... ఓ కవితా...

చూసే ప్రతి వీక్షకుడికి వరం నువ్వు..

వినే ప్రతి శ్రోతకుడికి స్వర్గం నువ్వు..

పాడే ప్రతి గేయకుడుకి గమ్యం నువ్వు..

రాసే ప్రతి రచయితకి ప్రాణం నువ్వు..


నా అణువణువునా పెనవేసుకున్న నీ పై ప్రేమ పొంగిపొర్లుతున్న వేళ వివరించతగునా సుమా ... 

ఈ అపురూప వాక్యాన్ని


రాసిన నేను కవిని కాకపోయినా కవితా హృదయంతో ఆదరిస్తావని ఆశపడుతున్నా సుమా... 

ఈ కమ్మని కావ్యాన్ని

                          ✍️సత్య పవన్✍️


Rate this content
Log in

Similar telugu poem from Classics