కవి
కవి
ఈతని కలానికి రెండూవైపులా పదునే
అదెప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు
సమాజాన్ని ప్రశ్నిస్తుంది
ఆలోచింపజేస్తుంది
మనుషుల్లో మురికిని తీసేస్తుంది
భవిష్యత్తుకు దిక్సూచి గా పనికొస్తుంది
అతని మనసుకు నచ్చినట్లు
హృదయం మేల్కొలిపినట్లు
అతని కలం ఆగకుండా లిఖిస్తూనే ఉంటుంది
అతను పదాలకోసం తడుముకోడు
ఇతనొక ఫాలాక్షుడు.. తెలియని విద్యల్లేవు
తెలియని విషయాలు ఉండవు
మనతోనే ఉన్నా..
తనలో తాను మాట్లాడుకుంటాడు
శత్రువులమీద కలంతో దాడి చేస్తాడు
ఉన్నట్లుండి విప్లవాన్ని సృష్టిస్తాడు
వెంటనే విరహగీతాలు రచిస్తాడు
అసూయను, ప్రకృతిని ఒకేలా రచించగలడు
అతడికలం ఒక సానపట్టిన కత్తి.
