STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

కవచం

కవచం

1 min
145


కాల యముడితోనైనా 

పోరాడి ప్రాణాన్ని ఫణంగా పెట్టి 

పురుడు పోసే ప్రాణ ప్రదాత 


కట్టెల పొయ్యి దగ్గర కళ్లెర్ర బారిన 

భారంగా కాకుండా 

బాధ్యతగా భావించి బువ్వొండి  

ఆకలి తీర్చే అన్నపూర్ణ 


కొండంత కన్న ప్రేమతో 

తన ఒడినే తొలి బడిగా మార్చి 

ఓనమాలు దిద్దించి అక్షర జ్ఞానాన్ని 

ప్రసాదించే ఆది గురువు 


అనారోగ్యంతో 

దవఖానా పాలయితే 

కంటికి కునుకు లేకుండా 

సేవ చేసి, కాపు కాచే రక్షణ కవచం 


తన ఆశలను సమాధి చేసుకొని 

కుటుంబమే సర్వస్వంగా 

అయినోళ్ళకై చివరి మజిలీ దాకా 

శ్రమించే ఓ నిస్వార్ధ త్యాగశీలి... అమ్మ...!


అన్నింటా తానై అణువణువూ 

అండగా నిలిచే మన అమ్మకు 

ఎన్ని జన్మలెత్తిన తన ఋణం తీర్చలేం...


కనకపు రాసులనే తన నెత్తిన పోసి 

అభిషేకం చేసిన తన త్యాగం ముందు 

అంతా శూన్యమే...!


అంతటి హృదయ వైశాల్యమైన 

వ్యక్తిత్వం ఒక్క అమ్మకే సొంతం 

ఒక్క అమ్మకు మాత్రమే సొంతం..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics