STORYMIRROR

Srinivas Cv

Abstract

2  

Srinivas Cv

Abstract

కులం కులం ఎమిటంట కులం

కులం కులం ఎమిటంట కులం

1 min
3.2K

కులం కులం ఏమిటిరా నీ కులం

ఆకలి రాజ్యంలొ అమ్మ అనే వాడికి పనికిరాదే కులం

చీకటి కౌగిట్లొ నిర్భయను చెరిచినవాడిది ఏ కులం

కులం అనే మాటే ఒక విషవలయం


కులం కులం ఏమిటంట కులం

రామాయణం చెప్పిన వాల్మీకికి ఏ కులం 

భారతంలొ కర్ణుడి ప్రతిభను ఆపదే ఏ కులం 

కులం కులం మనసును కలచివేసే వలయం 


కులం కులం కులం ఎందుకంట కులం

దాయాదుల పొరులో కల్లుమూసే కులం

దుర్మార్గులచూపులొ బెదిరిపోయే కులం

కులం కులం కులం చేతగాని జనం


కులం కులం ఎటు చూసినా కులం

ఓటుకు కులం, నోటుకు కులం

కాటికి కులం, కన్నీటికి కులం

ఏమి మిగిల్చింది ఈ కులం

కాకులే నయం


Rate this content
Log in

Similar telugu poem from Abstract