కుహు కుహు
కుహు కుహు


ప౹౹
కుహూ కుహూ కులుకలేలా ఓ కోయిలా
ఓహో ఒహో నవ వర్షం వచ్చేనని యిలా ౹2౹
చ౹౹
మారు పలికినందుకే మరులే పెరుగునా
ఏమారి పిలిచినందుకే ఎదనే కరుగునా ౹2౹
కలిసి పాడిన రాగం కఠినమైన కానిమ్ము
తెలిసిచేసిన చెలిమిలో తీపి చెరిసగము ౹ప౹
చ౹౹
కొండకోన ఏకమై కోటి వరాలే పంచి పెట్టే
కొత్త సంవత్సరం కోరికలతో వచ్చె యిట్టే ౹2౹
ఏమిటేమటో వింత పోకడలే ఎదురాయే
ఒకటేమిటీ వళ్ళంతా ఏదో తుళ్ళింతాయే ౹ప౹
చ౹౹
మంగళవాయిద్యం ఆమనిలా ఆవహించే
రంగుల వైభవం నయనాలెంతో ఊహించే ౹2౹
వచ్చేను వచ్చేనూ వరదలా పొంగి హర్షం
తెచ్చేను తెచ్చేనూ మదిలో ఈ నవ వర్షం ౹ప౹