కట్టె కావాలి
కట్టె కావాలి
పుట్టక మునుపు...
ప్రపంచం,
పంచభూతాలు,
ప్రకృతి,
వాటి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి
ఎప్పటి నుంచో వాటి పనుల్లో మార్పు లేదు
ఎవరు ఆదేశించారనో...
ప్రాణుల తలరాతను వ్రాస్తూ
వాటికి ఆహారం సమకూరుస్తూ
ఆటుపోటులను సృష్టిస్తూ
వాటిని ఎదుర్కొనే మార్గాన్ని అందిస్తూ
ప్రయత్నిస్తే ప్రశ్నలకు సమాధానాన్ని అందిస్తూ
తలమునకలై సృష్టి నిర్మాణంలో భగవంతుడు
పుట్టాక,నడక మొదలుపెట్టాక,
నడత నేర్చినాక...
వాటి పనుల్లో తేడా లేదు...
ఆ భగవంతుడు...
కర్మ యొక్క లెక్కలు,తీసివేతలతో
తీరిక లేకుండా గడిపేస్తుంటే...
తీరిగ్గా కూర్చుని,తేరగా తింటున్నా...
అలా తలరాతను వ్రాశాడు పైవాడు అనుకుంటే...
పడరాని పాట్లు పడాలని...
లేక నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని... తలచాడేమో...
సమస్యల సుడిగుండాన్ని సవాలుగా విసిరాడు...
బ్రతుకు పోరు మొదలు
కష్టించే సామర్థ్యం
కర్తవ్య నిర్వహణ మొదలు
క్రమంగా పనిలో మునిగిపోయా...
భూమిపై నా పయనం ఆగినా
పంచభుతాలతో పాటు
ఆ సృష్టికర్త కూడా పనుల్లో
నిమగ్నమయ్యే ఉంటారు ఎప్పటికీ...
దురాశతో దౌర్జన్యంతో
ఎంత కూడబెట్టినా
ఎంత అహాన్ని కూడగట్టుకున్నా
కర్మ తీరిందా...! కట్టె కాలును...
కట్టె కాలినా... ప్రపంచం ఆగిపోదు...
నా కోసం ఆగిపోదు...
ఇది తెలుసుకోవడమే జీవితం
తెలుసుకున్న తరుణంలో అహం కాస్తా...
మనిషి లోని మానవత్వానికి పూబాటను వేస్తుంది
అప్పటివరకు నేను అనే అహం
ముంచుతూనే ఉంటుంది.

