STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కృష్ణ కృష్ణ

కృష్ణ కృష్ణ

1 min
1

కృష్ణ కృష్ణ ( రుబాయిలు)  *********************** చెలిమి చేయు చిన్నవాడ!చింత తీర్చ రావె కన్న!
కలువకనుల స్వామి వీవె!కోర్కె తీర్చ రావె కన్న!
నీవె దిక్కు వంచు నమ్మి యున్న మమ్ము చూడ లేవ!
పలుకు లందు తేనె చిల్కి బెంగ తీర్చ రావె కన్న!//

 ఇంత గొడవ చేయుచుండి దాటిపోవు చిన్నికృష్ణ
ముంతలోని వెన్నదోచి పారిపోవు చిన్నికృష్ణ
కల్లలాడి మోసపుచ్చిగంతులేసి కులుకువాడ!
చెంత చేరి యలుక తీర్చి నవ్వి పోవు చిన్నకృష్ణ!

 నందగోపకిశోరుడా!నాటకములు చాలునయ్య!
అందమైన కొంటెగాడ!బూటకములు చాలునయ్య!
నిన్ను నమ్మి యుంటిమయ్య!తొల్గచేయి మాయనెల్ల
అందరివాడవే కదా!నీ వేషములు చాలునయ్య!//


Rate this content
Log in

Similar telugu poem from Classics