STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

క్రీగంటి చూపు

క్రీగంటి చూపు

1 min
295

క్రీగంటి చూపుతోనే కీరవాణి రాగంలో కీర్తనలే

ముని పంటి వత్తిడితో అధరాల అనువర్తనలే

ఎదురేగి స్వర్గం ఎదనేచేరి హాయి కలిగించదా

పదునురేగి ఆ పరువం పరదాలే తొలగించదా

ఊహించి ఆ భాగ్యం ఊరించి ఇక సారించునే

మోహించి మోహమే తనువంత వ్యాపించునే

క్రీగంటి చూపుతోనే కీరవాణి రాగంలో కీర్తనలే

ముని పంటి వత్తిడితో అధరాల అనువర్తనలే


కమనీయమే కనులలో కలలానే స్పురించునే

మహనీయమై మనసే పూమాలలై వరించునే

వెన్నెల రేయి పున్నమి పూచి వీచే వింజామర

వన్నెలు వేయి వెన్నలవెలుగై విరిసినే చామర

వేకువ చంద్రకూకువన ఎడదపాట్లే ఎరగవులే

కాకువ స్వరమే కనిపించక వర్ణించరే ఏకవులే


క్రీగంటి చూపుతోనే కీరవాణి రాగంలో కీర్తనలే

ముని పంటి వత్తిడితో అధరాల అనువర్తనలే

ఎదురేగి స్వర్గం ఎదనేచేరి హాయి కలిగించదా

పదునురేగి ఆ పరువం పరదాలే తొలగించదా


కొంటె వయసూ వరస మార్చి వదలలేకున్నది

వెంటబడి ఏమార్చనీయక ఇక కదలక ఉన్నది

కొంటె వయసూ వరస మార్చి వదల లేకున్నది

వెంటబడి ఏమార్చనీయక ఇక కదలక ఉన్నది

క్రీగంటి చూపుతోనే కీరవాణి రాగంలో కీర్తనలే

ముని పంటి వత్తిడితో అధరాల అనువర్తనలే


Rate this content
Log in

Similar telugu poem from Romance