క్రెడిట్ కార్డ్ కేరింతలు
క్రెడిట్ కార్డ్ కేరింతలు
నెలజీతం తెచ్చా
శ్రీమతి చేతికి ఇచ్చా
విచ్చిన కన్నులలో విస్మయం చూశా ..
దానర్ధం బోధపడి ఆలోచనలో పడ్డా
మధ్యతరగతి జీవులం
మారేకాలంలో మనుగడ బహు కష్టం
కోరికలు అణిచినా ..
ఎగిసే అవసరాలు ..
ఆపై ఎదురయ్యే అత్యవసరాలు ..
అప్పు కోరు ఖర్చులు
వెనుకాడేలా చేసే వడ్డీ భయాలు
ఒంటిరి ఎద్దు కష్టాలు
ఎన్నటికీ తీరని అసలులు
కార్పొరేట్ వ్యవస్థ చూపు ఆశలు
రంగుల మాయ ప్రపంచం విసిరే వలలు కోకొల్లలు
అవసరాలకే కదా
అత్యాశ కాదు అని....
అడుగేశా కార్డు వైపు
డెబిట్ కార్డు కోసం చూస్తే .....
ఎదురయ్యేను అకౌంట్ వెక్కిరింపు
గతిలేక పూర్తి చేశా క్రెడిట్ కార్డు ఫార్మ్....
కొత్త పెళ్ళి కూతుర్లా కళకళలాడుతూ కార్డు....
వినిపించే తన పలకరింపు
కార్డు చూసిన శ్రీమతికి గుర్తుకొచ్చే అవసరాల లిస్టు
ఓటు పడే పిల్లలకే ఫస్ట్
చెప్పొద్దూ ట్విస్టు
కార్డు ఇచ్చే కొత్త స్టైలు
కనపడనివ్వలేదు నేను స్మైలు
ఎక్కడికెళ్ళినా
కార్డు తీయి
స్వైప్ చేయి
నాటి భోగాలు సైతం
నిత్యావసరాలైన రోజులు
కార్డుకు తెచ్చేను రెక్కలు
నెల తిరిగేసరికి వచ్చిన బిల్లులు
చూసి తిరిగాయి నా కన్నులు ...
కాదనలేని బలహీనతలు, బరువులు
కార్చుకుంటూ కన్నీళ్ళు
కడుతున్నా కార్డుకి వడ్డీలు .
********&&&&&&**********
ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు(AK)
