కొత్త రాగం
కొత్త రాగం


ప౹౹ కోయిల రాగం కొత్తగా వినుపిస్తుంది ఈవేళ ఊహల ఊయలూ ఊగిసలాడే ఆ సరివేళ ౹2౹
చ౹౹ కొమ్మచాటున కమ్మని ఆలాపనలు విరిసెనే రెమ్మమాటున పూలూ పులకించి మురిసెనే ౹2౹
గగన వీధుల గాలిగంధం దిగివచ్చి గర్వించె గహన పాదుల పరిమళమూ ఎగసి నర్తించె
౹ప౹ చ౹౹ ఉదయకాలపు కావి బింబం కనుమరుగున హృదయ వీణలూ మ్రోగసాగెనూ చెరుగున ౹2౹
లేతవలపుల లేమ లేఖిని సందేశం లిఖించ పాత తలపుల పారవశ్వము తట్టి పలికించ
౹ప౹ చ౹౹ కోయిల కొత్తరాగమే పల్లవించినే కూరిమితో హాయిలా హత్తుకొనునే ఆ చిత్తంనే చేరికతో ౹2౹
సఖుని తిరుగు సందేశంతో తికమకలవగా లేఖని చదివి లేత మనసూ ముందే కలవగా ౹ప౹