కొత్త రాగం
కొత్త రాగం


సాకి౹౹
తరుణం తరిమెనే ఊహగా ఓ విచిత్రమై
కారణం తెలుసుకొని వస్తున్నా ఉత్తరమై
ప౹౹
మనసులో ఆ ఊహ ఎప్పుడు మధురం
మనవుకైనా సాధ్యమేనా అది ఆప తరం |2|
చ||
కవ్వించే అందమా కనికరించు బంధమై
గిలిగిచ్చే సౌఖ్యమా గెలిపించు అందమై |2|
తొలిప్రేమ లో ముడిసరుకు మౌనమేనా
తొలకరి ఈడూ తలచేది యవ్వనమేనా |ప|
చ||
గుండెనే గురిచేసి విరిచేసే ఆ చూపులు
ఉండి పోయెను ఎదలోనా నీ తలపులు |2|
పెరిగేది ప్రేమే మరువక మదిలో దాచిన
కరిగేది కాదే ఎన్నాళ్ళో ఎదురే చూచిన |ప|
చ||
చిలికిన ప్రేమంతా సింగారించే చిలుకల్లే
మొలిచిన ఆ వలపే చిగురించే కులుకల్లే |2|
కుదురైన ఆ ప్రేమ కురిసేనూ ఓ మేఘమై
కూరిమితోకోయిల పల్లవించే కొత్తరాగమై |ప|