STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కొత్త పలుకు

కొత్త పలుకు

1 min
380


భవిష్యత్తు మబ్బులా కరుగుతూ 

వర్తమానమై వర్షించి

గతసముద్రంలో కలిసిపోతోంది


కొండంత చీకటిని తొలుచుకుంటూ 

వెలుగు కిరణం తొంగిచూసింది


పుడమి గర్భాన్ని చీల్చుకుంటూ

మొక్కయొక్కటి మోరయెత్తింది


ఉగ్గపట్టిన వేదనకి

విమోచననిస్తూ

పొలికేక ఒక్కటి పిక్కటిల్లింది


కలికాలపు వంచనలు

కలకాలం సాగవంటూ

విప్లవ గీతమొక్కటి వెల్లివిరిసింది 


కడలితల్లి వొడివీడి పడుచుఅల

ఇసుకతిన్నెతో ఊసులాడింది


గలగలలాడే మావిడికొమ్మ

కోయిలమ్మతో మేలమాడింది


ఎగసిపడే భావాల కొలిమిలో

శిశిరాక్షరాలు రాలి కవిత పుట్టింది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance