Ramesh Babu Kommineni

Drama

4.8  

Ramesh Babu Kommineni

Drama

కొత్త కోణం

కొత్త కోణం

1 min
470


ప౹౹

ఎన్నోసార్లు చూసానే ఆ చక్కని ప్రదేశం 

మళ్ళీ చూడమని మనసే ఇచ్చే ఆదేశం ౹2౹


చ౹౹

పచ్చని కొండలు పలురకాలైన వృక్షాలు

తెచ్చేనే కనువిందునే దారులిరుపక్షాలు ౹2౹

మెట్లు మార్గం మెలితిరిగే ప్రయాణంలో

ఇక్కట్లు బాపూ ఇహ జీవిత యానంలో ౹ప౹


చ౹౹

కొండలరాయుని వైభవం చెప్ప తరమే

గుండెలనింపి కొల్వ లేదులే అంతరమే ౹2౹

తరతరాల పుణ్యం తనివి తీర వేడను

భావితరాల భాగ్యం ఆ క్షేత్రం చూడను ౹ప౹


చ౹౹

ఏడుకొండలు ప్రయాణమే కమనీయం

ఎడద పులకించూ తలచి రమణీయం ౹2౹

మరల చూడాలనిపించు ఆ ప్రయాణం

మరులుతో సాగిన జీవితాన కొత్తకోణం ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Drama