STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కోటి దీపరాశివే

కోటి దీపరాశివే

1 min
3

ఒక వాడని సుమమాలగ..మారితినని చెప్పనా..! 

మనసుకోవెలలో నిన్ను..నిలిపితినని చెప్పనా..! 


ఊచ్ఛ్వాసకు మధువులాగ..నీపేరే దక్కెనే.. 

నిశ్వాసగ గజలొక్కటి..పలికితినని చెప్పనా..! 


ఈ జగాన కణకణమున..కోటి దీపరాశివే.. 

అనంతమౌ నిను నాలో..చూసితినని చెప్పనా..! 


కనులకెంత పండుగంటె..మాటలేల చాలునిక.. 

అసలు-ప్రేమ రహస్యమే..అందితినని చెప్పనా..! 


అభినందన చేసేందుకు..తలపులెల్ల ఆగెలే.. 

నీదయ అను ధారలోన..తడిసితినని చెప్పనా..! 


అభిషేకము చేయగలుగు..అక్షరాలు ఉన్నవా.. 

నవవసంత గీతికనై..పొంగితినని చెప్పనా..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance