Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

కోరి వచ్చాను

కోరి వచ్చాను

1 min
462


ప౹౹

కోరి వచ్చానూ కోమలి మనసే తెలిసి

కోరికే తెచ్చాను పంచనే కలిసి మెలసి ౹2౹


చ౹౹

చెలి హృదయం చెంతకూ చేరమన్నది

చలి వాతావరణం సరసం కోరమన్నది ౹2౹

నింగి నేలా ఒకటవమన్నది అడకగనే

పొంగినలా ఎద పరవశంతో చూడకనే ౹ప౹


చ౹౹

ఆమని పులకించే ఆనందం ప్రకటించ

ఆమెనే ఆలకించే సరిగమగ వెల్లడించ ౹2౹

గురితో వలపు బాణం గురుతూ చేర్చ

చెరి సగమేగ కూడిన సౌఖ్యం గుర్తించ ౹ప౹


చ౹౹

ప్రేమ కన్నను పెన్నిది ఉన్నదే లోకంలో

గోముతో సన్నిధే బాధ తీర్చు శోకంలో ౹2౹

కోరిన కోరిక తీరుగా కాదనక తీరికతో

చేరిన ఎదలూ రెండొకటాయే చేరికతో ౹ప౹



Rate this content
Log in