STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

3  

Ramesh Babu Kommineni

Romance

కొండల్లో కూసిందిలే..

కొండల్లో కూసిందిలే..

1 min
200

కొండల్లో కూసిందిలే కొత్త కొత్తగా ఓ కోయిలా

గుండెల్లో మొలిచిందిలే వింత ఏదో హాయిలా

ఆ నాదం నవ వేదంలా సోకిందిలే ఎదలోనికి

నినాదం చేసేసి నికరంగా కదిలిపో కథలోనికి

కొండల్లో కూసిందిలే కొత్త కొత్తగా ఓ కోయిలా

గుండెల్లో మొలిచిందిలే వింత ఏదో హాయిలా


సాగరఘోషలా స్రవించేనే ఆ హృదయనాదం

ఆగని ప్రయాసలా అగుపించదూ ప్రేమ భేదం

వరించాక వలపులో కనిపించవులే వగపులు

సవరించాక సమసి పోవునే తేలని తగవులు

కొండల్లో కూసిందిలే కొత్త కొత్తగా ఓ కోయిలా

గుండెల్లో మొలిచిందిలే వింత ఏదో హాయిలా


వలపంటే వట్టి మోహమూ కాదనీ తెలుసుకో

కలసుంటే కలదూ ప్రేమని తెలిసీ మసులుకో

సంబరమేలే సరసాలలో సానుకూలమైనచో

అంబరమంత అవకాశం ప్రతికూలత లేనిచో


కొండల్లో కూసిందిలే కొత్త కొత్తగా ఓ కోయిలా

గుండెల్లో మొలిచిందిలే వింత ఏదో హాయిలా

ఆ నాదం నవ వేదంలా సోకిందిలే ఎదలోనికి

నినాదం చేసేసి నికరంగా కదిలిపో కథలోనికి


తెలి మంచులో తేనెలూరే తెమ్మెరా తియ్యనే 

తేలి వచ్చిన రాగం రంజిల్లునూ చేరదియ్యనే

తెలి మంచులో తేనెలూరే తెమ్మెరా తియ్యనే 

తేలి వచ్చిన రాగం రంజిల్లునూ చేరదియ్యనే

కొండల్లో కూసిందిలే కొత్త కొత్తగా ఓ కోయిలా

గుండెల్లో మొలిచిందిలే వింత ఏదో హాయిలా



Rate this content
Log in

Similar telugu poem from Romance