STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

కొంచెం నిప్పు కొంచెం నీరు

కొంచెం నిప్పు కొంచెం నీరు

1 min
405

నది ఒడ్డున ఉన్న నేను

సాగర తీరాన్ని చేరాను

సందిగ్ధపు సమస్యలలో ఉన్న నేను

నన్ను ప్రేమించుకుంటూ కాస్త ముందుకు నడిచాను


కొత్త పరిచయాలు అలల్లా మీద పడ్డాయి

కష్టాల్ని తోసిపుచ్చి కాస్త నవ్వమన్నాయి

నా పుస్తకాల్ని గుండెలకు హత్తుకుని

అందులోని భావాల్ని పొదివి పట్టుకోమన్నాయి


గ్రీష్మకాల సుప్తావస్థకు న్యాయం చేశాను

లాక్ డౌన్లో కొత్త వంటలు నేర్చాను

ఎప్పుడు పడుతుందో తెలీని వానతో ఎంజాయ్ చేశాను

(గొడుగు ఉందండోయ్)


పున్నమి వేళ 

విశాఖలో సాగర తీరాన

నాతో నేనే 

చుట్టూ నేనొక్కడినే

నన్ను కాస్త వెతుక్కుని 

ఫరవాలేదని నవ్వుకున్నాను


అలలు నెట్టేసే ఇసుక రేణువుల్లా జ్ఞాపకాలు

నా కాళ్ళకు అంటుకున్నాయి

అలా అలా నడుస్తూ 

బీచ్ కి కొత్త శ్వాసల్ని అందిస్తున్నాను.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract