కను పాపలా
కను పాపలా
కంటికి స్పష్టమైన చూపు లా....
కంటిలోని కను పాపలా
నాలో వదిగిన తియ్యని జ్ఞాపకంలా...
అందమైన మధుర స్వప్నంలా....
కవిలోని భావ వీచికలా
అంతరంగం లోనిఅద్భుత అనుభవ స్మృతి లా
స్వచ్ఛమైన ప్రేమకు నిజమైన రూపంలా
మనస్సుకు దగ్గరైన మంచి
నేస్తంలా
పవిత్రతకు పెట్టిన పేరులా
నాలోని భావస్పందనకు
నిజమైన ప్రేరణ నీవే...
నా అలసిన హృదయానికి ఆలంబనలా
నాలో నిరంతరము నిలిచిన ఊపిరి నీవై...
నా కవిత్వానికి ప్రేరణ నీవై
నాలోని ప్రేమకు ప్రాణం నీవై
వెన్నల కౌగిటీలో వదిగిన చల్లదనానివి నీవై....
సముద్రాన్ని అంటిన వాయువులా....
నాలోని రసానుభూతుల
తోరణమై....
హృదయ స్పందన నీవే బంగారం...
... సిరి ✍️❤️

