కన్నులసలు
కన్నులసలు
కన్నులసలు మూయలేను..కలలుకంటు ఉండలేను..!
కన్నులెదుటి కలలపంట..సాక్షిగాక నిలువలేను..!
రాలిపోవు ప్రతిపువ్వు..చేరేనా నీ పదముల..
పూవులేవొ అర్పించగ..ఏవేళా కోయలేను..!
జపమేదో తపమేదో..నామస్మరణ మధురమేమొ..
నీధ్యానంలోన గాక..ఊరికేదొ చేయలేను..!
అమృతమేదొ అవసరమా..మరణమేదొ లేనప్పుడు..
యద్ధానికి దిగడానికి..ఒకబాంబుగ మారలేను..!
నీవిలాగ బ్రతకాలని..నేనెవరికి చెప్పాలట..
నిన్నుగూర్చి లోకానికి..మాటలలో తెలుపలేను..!
అడుగకనే దారిచూపు..పరమగురువు నీవేగా..
శివతత్వము వివరించగ..ఒకపాటగ మిగలలేను..!

