STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

కమ్మని కల

కమ్మని కల

1 min
23.3K


ప౹౹ 

కవ్వించకు కనులతో అసలే వయసూరుకోదు 

ఝళిపించకు ఆ అందాలతో మనసూరుకోదు ౹2౹


చ౹౹ 

కలలో కమ్మని కలలో తీయని గీతం విన్నాను 

వలలో వలపు వలలో చూడక చిక్కుకున్నాను ౹2౹


తేరపార చూడనీదుగా తెలియని ఆ మైకమూ 

తేరుకొని వివరించనీదుగా వింతల మోహమూ

౹ప౹

 చ౹౹ 

ఊరకలా వచ్చిపోకు ఉడికించేసి ఉన్న ఎదను

 ఊరికినే మర్చిపోకు చేసేసిన గాయాల కథను ౹2౹


నడక నడకలోను అరే ఆ నడుం ఊపులోనూ 

ఉడక ఉడక రేపేసే మరి మత్తెన చూపులోనూ

౹ప౹

 చ౹౹ 

ఎడద భావం ఎదురేగి చేరనీయదు చేరువునే

 బెడద భయం వ్యక్తపరచనీయదుగా వెరపునే ౹2౹


కోరికలెల్ల చీరికలై నాట్యమాడినే తనువుతోనే

 తారకలన్నీ తాంబూలమిచ్చెనూ అనువుగానే ౹ప౹


Rate this content
Log in