కలవరం
కలవరం


ప||
వెన్నెల వెన్నెలా ఏమని చెప్పను వివరం
నన్నిల నన్నిలా కమ్మిన వలపు కలవరం |2|
చ||
నిన్నగాక మొన్న మొక్కానే మన్మధుడునే
చిన్నగా కోరానే కోరికనే పుష్పధన్వుడునే |2|
ఎలమి తీరం చేర్చి ఆ ఎదలూ కలపమని
కాలమే కలిసి వచ్చిప్రేమలనే తెలుపమని |ప|
చ||
మనసూ రంగరించి వెలిగించా మైనంగా
ధనుసూ ఎక్కుపెట్టి రగిలించు అదనంగా |2|
ముసిమే ముసురుగా కమ్మాలి ముచ్చటై
మిసిమే ముసిగా నవ్వాలి తను అచ్చటే |ప|
చ||
అంతులేని కూరిమికి కొలమానం లేదుగా
కాంతులీనే ఆ కనులకు సరి ఏది కాదుగా |2|
తొలగించవా మనుసులోని ఆ కలవరం
కలిగించవా స్వాంతనమే ఇచ్చి ఓ వరం |ప|