STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Romance

4  

Venkata Rama Seshu Nandagiri

Romance

కలంస్నేహం

కలంస్నేహం

1 min
341

ఓ చెలీ! నీ చెలిమికి నా మది దాసోహం

కలంస్నేహంతో మొదలైన మన స్నేహబంధం

అలంకారాన్నే అలంకరిస్తే కలంస్నేహం

అలరించును నిను నా ప్రేమబంధం.

నా ఊహల పదాలు ఊపిరి అక్షరాలుగా మలిచా

నా మదినే గుడిగా చేసి, నిన్నే దేవతగా కొలిచా.

నీవు మెచ్చిన నా కవితలే నా మది నిండే ఊపిరులు

నీ తీయటి పలుకులే నాహృదిని మేల్కొలిపే గీతికలు.

నను కలుస్తానని నీవిచ్చిన మాటే వరం

నా మదిని దోచిన ఆ కళ్లే మాయ ప్రపంచం

నిను చూడక ఎలా ఉండగలిగానింతకాలం

క్షణమైనా ఇక నినువీడి ఉండలేదు నా హృదయం

నీవనుగ్రహించిన నిన్నటి క్షణాలే వెయ్యి వరాలు

వరాల జల్లులో నిలువెల్లా తడిచింది నా ఒడలు

మనసంతా నిండిన ఆనందంతో కురిసెను కనులు

కాగలము మనమిక పెద్దలనుమతితో ఆలుమగలు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance