కలలో
కలలో
కలలో కరగని..తరగని వేడుక..!
ప్రేమయె మాయని..తియ్యని వేడుక..!
నిశీధి చెట్టున..పాటల కోకిల..
మౌనం వీడని..వాడని వేడుక..!
చెలిమికి అద్దం..నవ్వే మనసే..
రాగం అంటని..చక్కని వేడుక..!
మాటల గువ్వల..కువకువ అందం..
తలపే ఆగని..ఆరని వేడుక..!
శాంతిని వెదికే..పనిగా యుద్ధం..
కలతలు తొలగని..కమ్మని వేడుక..!
వలపే నరకం..దృష్టియె స్వర్గం..
ఊహకు అందని..మరగని వేడుక..!

