STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

3  

Ramesh Babu Kommineni

Romance

కలలో నేస్తం

కలలో నేస్తం

1 min
152

ప||

కలలో కొచ్చిన నేస్తమా కలిసే ఉండుమా

ఇలలోను వాస్తవమా తెలిసే నడువుమా |2|


చ||


ఏ ప్రేమకోరి ఎదురు చూసానో ఎరగవులే

ఏపాటిదో ఆ ప్రేమ వర్ణించలేరు ఏ కవులే |2|


కొండకూడా అద్దంలో చూసిన కొంచెమేలే

గుండెలో నిండిన ఆ కూరిమి ఎంచమేలే |ప|


చ||


చూసి చూసి వేసారాక చూపొకటి విసిరి

వేచివేచి కోరావు ఆ కొత్త కోరికొకటి కొసిరి |2|


తనువంత వలపుతనము నింపి తరలేవు

చనువంత చిలికి చలాకి చూపి మరలేవు |ప|


చ||


ఆ సోయుగం ఏమని చెప్పను నా తరమే

ఓ యుగం వేచినా దొరికేనా ప్రేమ వరమే |2|


అనుకోని స్వప్నమా అలా ఉండిపోరాదా

అనుకొన్న ఆశల్ని మదిలో పండనీ రాదా |ప|


Rate this content
Log in

Similar telugu poem from Romance