కలలనావ
కలలనావ
కలలనావ జీవితమై..సాగుతు'నే ఉంది..!
మనసు మంచుపూవు లాగ..రాలుతు'నే ఉంది..!
పద్దులెన్నొ వ్రాసుకునే..వచ్చినాము ఇటకు..
నాటకమను ఎఱుక అలా..తప్పుతు 'నే ఉంది..!
కొత్తగ మరి ఇక్కడేది..సృష్టి జరగలేదు..
ఈ సంగతి మరచి నేను..ఎగురుతు'నే ఉంది..!
గోడలేవి లేనిచోట..తలుపుకేది చోటు..
గాలిగదికి ప్రేమ తెరను..దింపుతు'నే ఉంది..!
చెలిమిగుట్టు పట్టకనే..తగవులాట లన్ని..
జతకట్టిన కన్నుదోయి..అలుగుతు' నే ఉంది..

