కలలే నేస్తం
కలలే నేస్తం
పరిహసించు వెన్నెలిపుడు..కలలనేస్తంలా ఉంది..!
పరితపించు మనసేమో..అలలసంద్రంలా ఉంది..!
ఆవిరయే ఉద్వేగం..రసయోగం ఎలాగోయి..
పల్లవించు ప్రతిభావం..నీలిమేఘంలా ఉంది..!
అకారణం అద్వైతం..ఆనందం సత్యమేను..
పలుకరించు మౌనమేమొ..దారిదీపంలా ఉంది..!
గురుబోధయె అందునులే..ఊపిరింటికి పాటలా..
సంస్కరించు గగనమంటి..స్వర్గద్వారంలా ఉంది..!
నవవసంత రాగసుధా..మేళకర్త సోయగమా..
పరిక్రమించు ఒకతారా..సుమహారంలా ఉంది..!
ఆశయాల సాధనలో..అద్దమెచట ..
పరిభ్రమించు కాలానికి..అచలసాక్ష్యంలా ఉంది..!

