కల కాదుగా
కల కాదుగా
ఒకవేడుకే మది ఊయలై కదిలించడం కల కాదుగా..!
వెలివేయకే ననుచేరనీ, మురిపించడం కలకాదుగా..!
విరచించినా తడి గేయమే తనప్రాణమై పిలిచింది లా..
ముసురేసినా హృది పొంగుతూ పలికించడం కలకాదుగా..
జలజాతరై పారిందిలే ఒకచిత్తమే వణికింది గా..
విరహాగ్నినే వరహాలుగా కురిపించడం కలకాదుగా..
ఒడిచేరనీ కథలెందుకూ...మరలాలిగా మరుప్రేమలూ
సడి సేయనీ తన మానసం చిలికించడం కలకాదుగా....!
బలమైనదే మన ప్రేమనీ తలచానుగా మనసారగా
వలపన్నదీ వలరాజునే మెరిపించడం. కలకాదుగా..!

