కే.ఎం. మున్షీ
కే.ఎం. మున్షీ


తలచిన చాలు జ్ఞాన వీచికలు –
నిలిచిన అందే కన్హయ్య ప్రణాళిక లు
తరించే స్వాతంత్ర్య ఉద్యమము నందు
కన్హయ్య కలలు నిజముగా వెళ్లి విరిసే // తలచిన //
రాజ్యాంగ రచనములో కన్హయ్య చేయూత
మంత్రాంగములో మున్షీ కార్య దక్షత
రైతు బాంధవ , భార తీయ విద్యా భవన నవ నిర్మాత యై
విద్యా విజ్ఞాన సౌరభ పరిమళాలు పంచిన // తలచిన //
అక్షర రాజ మణి మాణిక్యం - రచనా రంగ వ్యాసాంగం -
రాజీ పడని సక్రియా కర్మయోగి తపస్విని,
జై సోమనాథ కృతుల ప్రఖ్యాత విశ్వవిఖ్యాత
భారత వికాస స్మృతి పథమ్ము న చిరస్మరణీయ // తలచిన //