STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

కాంక్షితాలు

కాంక్షితాలు

1 min
305

కలవరించే కనులకేమో కాంక్షితాలు ఎక్కువే

వెలువరించే భావాలతోఎదమొత్తం చిక్కులే

అలరించే అభినయాలకు ఔపోసనలు ఎన్నో

వివరించే విషయాలకూ విమర్శలూ ఇంకెన్నో

చారడేసి కళ్ళకు చామంతులా మెరుపులేగ

ఓరచూసే వయసుకూ వగలతో బరువులేగ

కలవరించే కనులకేమో కాంక్షితాలు ఎక్కువే

వెలువరించే భావాలతోఎదమొత్తం చిక్కులే


దూరానా కానరాని తీరానా కదిలించే కథలే

భారానా లేనిసంబరానా కనిపించని వ్యధలే

అలుపెరుగని ప్రేమలో అసలుకే ఆ విజయం

విలువెరిగిన వలపుకి వీలైతే జయం జయం

కలవరించే కనులకేమో కాంక్షితాలు ఎక్కువే

వెలువరించే భావాలతోఎదమొత్తం చిక్కులే

అలరించే అభినయాలకు ఔపోసనలు ఎన్నో

వివరించే విషయాలకూ విమర్శలూ ఇంకెన్నో


మనసయితే ఒకటుందిగా వేరే బాధించనూ

సొగసుకూడా తోడుందిలే మరీ సాధించనూ

మనసయితే ఒకటుందిగా వేరే బాధించనూ

సొగసుకూడ తోడుందిలే మరీ సాధించనూ

కలవరించే కనులకేమో కాంక్షితాలు ఎక్కువే

వెలువరించే భావాలతో ఎదమొత్తం చిక్కులే



Rate this content
Log in

Similar telugu poem from Romance