STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కాలపు మంత్రదండం

కాలపు మంత్రదండం

1 min
305


కాలం అంతుచిక్కని అనంత విశ్వరూపం

కాలపు వలలో చిక్కని దేది 

ఈ విశ్వంలో లేనేలేదు 

కాలం శిల్పిగా మారి 

చెక్కిన ప్రకృతి శిల్పాలెన్నో

కదిలే కాలపు నావలో 

కాగితపు పడవలం మనం


కాలం ఆచరణకు 

మెరుగుపెట్టు గీటురాయి

కాలపు త్రాసులో క్షణాల్లో 

పరిస్థితులు తారుమారు

కాలం మానవుని కంటికి కనపడని 

నిరంతర నిత్య గంభీర ప్రవాహిని

మానవుని కాకి లెక్కల్లో కాలం 

యుగాలు, వత్సరాలు, 

క్షణాలుగా విభజించకున్నాడు

తన అనంత స్వరూపం తెలియక


కాలం కడుపులో దాగిన

 గత వైభవాల వెలుగులెన్నో

కాలo కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించే 

క్రమం తప్పని క్రమశిక్షణపరురాలు

కాలం యవనికపై ఆవిష్కృతమైన 

అద్భుతాలు ఎన్నో


రాజు బంటు, పేద, ధనిక చిన్న, 

పెద్దనే బేధం చూపని

సమన్యాయపు సమవర్తిని

మానని గాయాలకు అద్భుతమైన 

మందును వేసేది,

కాలపు మంత్రదండంమే


లేకపోతే కాలపు మాయాజాలం లో

మసిబారిన మహాగాధలు ఎన్నెన్నో

ఆ విశ్వరూపం ముందు మనమెంతా

కనిపించని పీపీలికాలం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance