STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

కాలం రంగులేస్తూ సాగుతోంది

కాలం రంగులేస్తూ సాగుతోంది

1 min
5


మనసుకు రెక్కలు వచ్చి ఎగురుతుంది

వాస్తవాలు నింగిలో గ్రద్దలా తిరుగుతున్నాయి

కాలం రంగులేస్తూ సాగుతుంది 

ఆశా జీవులు చిలక పంజరములో చిక్కుకున్నట్లు..


నీరులా ఊరుతున్నాయి కొత్త కోరికలు

జీవితపు గిరుల్లో వంకర్లు తిరుగుతుంటే 

నేర్చిన విద్య వైద్యంలా పనిచేస్తూ పోతుంటే

స్వచ్ఛమైన ఊహల్లో ప్రయాణం సాగిస్తుంది..


మూఢత్వపు మురికి కంపు ఇంకా కొడుతుంది 

కట్టె కాలిన బొగ్గు రంగు పోవడం లేదు

చాదస్తపు మనసులో చీకటి కమ్ముకుంటే

జ్ఞాన జ్యోతులు నక్షత్రాల్లా తిరుగుతున్నాయి సుమా..


రాతియుగపు ఆయుధం కొత్త పుంతలు తొక్కుతూ

సమాజంలో అశాంతికి కారణమవుతుంది 

దివ్యధాత్రి దిగులు పడి ఏడుస్తుంటే

పదునైన కత్తి మానవత్వాన్ని తుంచి వేస్తుంది..


గాలి మేడల్లో స్వర్గపు ఉయ్యాల ఊగుతుంటే

పసిప్రాయపు రెక్కలు నింగిలో ఎగరలేక

వాస్తవాలను నేలపై లెక్కలు వేస్తూ 

కాసిన ఆకాశ ఫలాన్ని చూస్తూ నెమరు వేస్తున్నారు..


సృష్టిలో ఏది ఎవరి సొంతం చెందుతుందో

వేల చేతుల సృష్టించాలని మనిషి కే అవసరం 

మహా నాటకాన్ని రక్తి కట్టించి పాత్రదారుడు అతడు 

తెర పైన వేల యుద్ధాలు సృష్టించగలడు.


మనసును సరిదిద్దేందుకు ఔషధం కావాలి 

చెయ్యి చెయ్యి మధ్య బలం ఏర్పరుచుకోవాలి

సకల జీవులలో దైవం చూడగలిగినప్పుడే

నిర్మలమైన మనసులో నిత్య యవ్వనం చిగురిస్తుంది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics