STORYMIRROR

Midhun babu

Drama Classics Others

4  

Midhun babu

Drama Classics Others

కాళరాత్రి

కాళరాత్రి

1 min
17

కలలు తప్పుకు తిరుగుతుంటే కాళరాత్రులు నవ్వుతున్నవి 

శోకమంతా తెరలుతుంటే

 రెండుకన్నులు మునుగుతున్నవి


గడ్డుకాలం మొదలుపెట్టిన

 సమరమెందుకు ఆగదో మరి  

విల్లు పట్టిన క్షణములన్నీ

 వేలశరములు గుప్పుతున్నవి


మండువేసవిలాంటి కాలం

వానలను వెలివేసెనేమో

గుండెలోపల పెరిగిపోయిన ప్రేమవనములు కాలుతున్నవి  


కంటిరెప్పల మాటునున్నా

సెగలు సోకుట న్యాయమేనా

స్వప్నలోకం మండుతుంటే

నేత్రజలములు మరుగుతున్నవి


పొద్దు చూడని గడియలన్నీ

నడకలెందుకు ఆపినాయో

యుగాలెన్నో నడచిపోతే

ఎదురుచూపులు నలుగుతున్నవి


ప్రేమచినుకులు రాలకుంటే 

రాతలేదని ఊరుకున్నా. 

ఎదురుచెప్పని బతుకులోనే

వెతలవాగులు ఉరుకుతున్నవి


సుదూరంగా ఉండిపోయిన చెలియ చెంతకు 'వెన్నెలరాజ'

నన్ను చేర్చని బాటలన్నీ

కొత్తమలుపులు తిరుగుతున్న


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama